Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 4:45 pm Posted by : ramakrishna

ఘనంగా బతుకమ్మ సంబరాలు

రుద్రూర్, బతుకమ్మ : బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బతుకమ్మ ఉత్సవాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాల వేడుకల నిర్వహణపై స్థానికులు విద్యార్థులను అభినందించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం(ఆర్) గ్రామంలో గల మోడల్ వసతి గృహంలో విద్యార్థులు శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలతో వసతి గృహ వార్డెన్, విద్యార్ధినులు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.