కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
గౌరీమాతకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, కలెక్టర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో టీఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు. బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్...