స్నేహ సొసైటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ ప్రాజెక్టు లో పనిచేస్తున్న ఆయా కార్యక్రమాల సిబ్బంది తో కలిసి బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేంద్ర గుప్తా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనదని ఇది దైవ భక్తితో కూడుకున్నదే కాదని బతుకమ్మ ఆడటం మహిళలకు...