Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 6:39 pm Posted by : ramakrishna

స్నేహ సొసైటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ ప్రాజెక్టు లో పనిచేస్తున్న ఆయా కార్యక్రమాల సిబ్బంది తో కలిసి బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేంద్ర గుప్తా  హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనదని ఇది దైవ భక్తితో కూడుకున్నదే కాదని బతుకమ్మ ఆడటం మహిళలకు ఎంతో ఆరోగ్యకరమని కాబట్టి మన పూర్వీకులు బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకతను ఇచ్చారని చెప్పారు. స్నేహ సొసైటీ తో నా అనుబంధం 30 ఏళ్ల నాటిదని ఆయన తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్నేహ సొసైటీ కి వచ్చి స్నేహ సొసైటీ లోని దివ్యాంగ బాలలు, సిబ్బందితో కలవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. మహిళా మణులు ఎంతో సంతోషంగా సహజసిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకున్నారు.. బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు.దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సి ద్దయ్య మాట్లాడుతూ  ప్రకృతిలో లభించే పూలను పూజించే పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదని అది తెలంగాణ ప్రత్యేక పండగానే తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతికి బతుకమ్మ ఒక ఉదాహరణ అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తెలంగాణ సాంప్రదాయ పండుగైన బతుకమ్మను ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారని తెలిపారు,  జిల్లా పాలనయాత్రాంగానికి ప్రజలకు, మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. స్నేహ సొసైటీలో దివ్యాంగుల పాఠశాల సిబ్బంది, అందుల పాఠశాలలోని సిబ్బంది,  టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న మహిళ సిబ్బంది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ బతుకమ్మ ఉత్సవాల్లో స్నేహ సొసైటీ సభ్యులు టీ. వీరేశం, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు మేనేజర్ బాలరాజు స్నేహ సొసైటీ వివిధ కార్యక్రమాల్లో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు.

Bathukamma celebrations in full swing at Sneha Society