కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని చాలా ఉత్సాహంగా ఆనందోత్సాహాలతో కోలాహలంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సంస్కృతిక పండగా ప్రఖ్యాతి పొందిన బతుకమ్మ పండుగను ఘనవంగా నిర్వహించుకున్నారు. పులు తెచ్చి పేర్చి బతుకమ్మ ఆడారు. విద్యార్థులు ఆనంద ఉత్సవంలో గంతులేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రమీల, మమత విద్యార్థులు పాల్గొన్నారు.
