Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2025, 6:33 pm Posted by : ramakrishna

25న బాన్సువాడలో బతుకమ్మ సంబురాలు

బాన్సువాడ, బతుకమ్మ : తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ బతుకమ్మ పండుగ పురస్కరించుకొని ఈ నెల 25న సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, గొంప గోవర్ధన్, నాయకులు నల్లమమడుగు సురేందర్, హన్మంత్ సిందే, జిల్లా పార్టీ అధ్యక్షుడు యమ్.కే. ముజ్జుభోద్దీన్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమా, టీఎస్పీఎస్ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్, జిల్లా మాజీ ప్రజాప్రతినిధులు,బతుకమ్మ వేడుకలకు హాజరవుతున్నారన్నారు. మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఈ బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని బాన్సువాడ బిఆర్ఎస్ నాయకులు కోరారు.