Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 6:01 pm Posted by : ramakrishna

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలు

 

సదాశివనగర్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల మర్కల్  గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి నందు బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.అధ్యాపకులు, విద్యార్థులంతా కలిసి తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబింభించేలా తీరొక్క పువ్వులతో బతుకమ్మ ను అలంకరింంచి, ఆటపాటలతో అలరించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికీ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, కల్చరల్ కమిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ కే. వనజ, సభ్యురాలు నవనీత తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొని, విజయవంతం చేశారు.

Bathukamma celebrations at the Telangana Social Welfare Residential Women's Degree College.