సత్య ఒకేషనల్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్ సిటీబతుకమ్మ : నగరంలోని లోని సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పూలతో బతుకమ్మను పేర్చి అమ్మవారికి పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమర్జనం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చిలువేరి సురేష్ బాబు, కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ చిలువేరి మురళీకృష్ణ, కళాశాల సమన్వయ కర్త బి.విజయరామరాజు కళాశాల ఇంచార్జీలు సునీల్, కళ్యాణ్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.