మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్, టి పెద్దన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా కలశాల ప్రిన్స్ పాల్ మాట్లాడుతు ,బిఏ, బికాం, బి ఎస్సి, పిల్లలు క్లాస్ ల, వారిగా , బతుకమ్మను రకరకాల రంగుల పూలతో అత్యంత సుందరంగా పేర్చి బతుకమ్మకు దూప దీప నైవేద్యా, ప్రసాదాలు మంగళా హారతులిచ్చి చుట్టూ కోలాట నాట్య ప్రదర్శనాలతో పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. పర్యావరణహితమైనది సర్వజనులు కలిసి ఆనందోత్సవాలతో నిర్వహించుకునేదే బతకమ్మ పండగ చిత్తుచిత్తుల బొమ్మ చిత్తయిన బొమ్మ ఓయమ్మ మాయమ్మ బతుకమ్మ బతుకమ్మ , బతుకమ్మ, ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ సత్తుపిండి పులిహోర నైవేద్యంగా సమర్పించి నృత్యాలు కేరింతలు కొడుతూ కోలాహాలంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి బ్యుల, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ యు, దశరథ్, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.