Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 7:23 pm Posted by : ramakrishna

ఇందూర్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ బోధన్: బోధన్‌ ఆచన్‌పల్లి లోని ఇందూర్‌ హైస్కూల్లో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినిలు సాంప్రదాయ చీరలు ధరించి పూలతో అలంకరించుకుని 8ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ నృత్యాలతో ఆనందాన్ని పంచుకున్నారు. బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆరాధించే విశిష్ట ఆచారమని ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో ఉత్సాహం నింపేలా పాఠశాల ప్రాంగణంలో ఆటపాటలతో కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిఫలించిన ఈ ఉత్సవంలో పాఠశాల కరస్పాండెంట్‌ కిషోర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Bathukamma celebrations at Indore High School

Bathukamma celebrations at Indore High School