అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ సంబరాలు
రుద్రూర్, బతుకమ్మ: బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ - 3 లో బుధవారం అంగన్వాడీ టీచర్లు చిన్నారులతో కలిసి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. రంగు రంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి, ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గంగామణి, సునంద, రూప, పద్మ, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.