బతుకమ్మ, మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగను మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండలంలోని పాలెం, సుంకేట్, శేట్ పల్లీ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేకంగా అలంకరించి పాఠశాలల్లో పండుగా వాతావరణ నెలకొల్పారు.

సుంకేట్ పాఠశాలలో 10 అడుగుల బతుకమ్మను రంగురంగుల పూలతో ప్రత్యేకత అంతరించుకుంది. ఒకేసి పువ్వేసి చందమామ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, డీజే పాటలతో వలలో అంటూ పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ సంతోషంగా గ్రామాల్లోని ప్రధాని వీధుల గుండా ఊరేగింపు చేసి పెద్దవాగులోను, గ్రామ ఊర చెరువులోని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయశ్రీ, త్రివేణి, రాజేశ్వరి, ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరావు, వెంకటయ్య, పెద్ది సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు మహేష్ కుమార్, చంద్రశేఖర్, నరసింహస్వామి, రాజేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
