ఖతార్ లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుక
వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఖతార్ తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి కవిత ఉత్సాహంగా బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ బిడ్డలు బతుకుదెరువు కోసం బొగ్గుబాయి.. దుబాయికి పోయిండ్రు అని చెప్పుకునేటోళ్లమన్నారు. ఇక్కడికి వచ్చిన వారి కష్టాలు మాకు తెలుసని.. తల్లిదండ్రులు, కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడ క్యాంపులల్లో ఉంటూ వచ్చే జీతంలో ఎంతో కొంత మిగిల్చి ఇంటికి...