Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2025, 7:28 pm Posted by : ramakrishna

మస్కట్ లో ఘనంగా బతుకమ్మ

బతుకమ్మ, వెబ్ న్యూస్ : తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మస్కట్ దేశంలో అక్కడ నివాసముంటున్న తెలుగు వారందరూ బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంటి ఆడపడుచులు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి అందరూ ఒక దగ్గర చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఇద్దర్ అక్క చెల్లెళ్లను ఉయ్యాలో ఒక్క ఊరికి ఇచ్చిరి ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి పెంట తెచ్చిన తినుబండాలను ఒకరికొకరు పంచుకుంటూ సంతోషంగా పండుగని జరుపుకున్నారు.