Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2024, 3:50 pm Posted by : ramakrishna

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని మహిళ ఉద్యోగులు మంగళవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అందరూ కలిసి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి జెన్ కో కేంద్రం ముందు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంతోషంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా సంతోషంతో పాటలు పాడుతూ బతుకమ్మలను కాకతీయ కాలువలో నిమర్జనం చేశారు. కార్యక్రమంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్ర సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు