Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 6:55 pm Posted by : ramakrishna

లయోలా హై స్కూల్ లో బతకమ్మ సంబరాలు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని లయోలా హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలలో విద్యార్థులు ఉపాధ్యాయురాలు ఆటల పాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.బి చారి. పాఠశాల డైరెక్టర్ ఫహీం, ఉపాధ్యాయులు రాంగోపాల్. నీరజ విద్యార్థిని శ్రీమహీ మాట్లాడారు లయోలా హై స్కూల్ పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకునే బతుకమ్మ సంబరాలను ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణలో మహిళలు అన్ని పండగల కంటే  ఎక్కువగా ఇష్టపడే పండుగ అంటే బతకమ్మ పండగ అన్నారు. వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ  బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు . ఉపాధ్యాయురాలు విద్యార్థులు పాల్గొన్నారు.

Batakamma celebrations at Loyola High School