Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 11:19 am Posted by : ramakrishna

చదువులకు నిలయంగా బాసర

శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నా మంత్రి శ్రీధర్ బాబు

బాసర, బతుకమ్మ : చదువులకు నిలయంగా బాసరను నిలపాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం దర్శించుకున్నారు. అంతకుముందు మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాసర అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టం అన్నారు. మాస్టర్ ప్లాన్ ఆలయ పెద్దల సూచనలతో ఆలయాన్ని తీర్చిదిద్దే కార్యాచరణ తీసుకుంటామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జ్ఞాన సరస్వతీ కొలువుదీరిన ప్రదేశంలో ట్రిపుల్ ఐటీ నెలకొల్పారని గుర్తు చేశారు.