ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌళిక సదుపాయాలు సమకూర్చాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, వ్యవసాయం, పాక్స్ తదితర శాఖల అధికారులతో వరి కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పూర్తయిందని, కొనుగోళ్లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 419 వరి కొనుగోళ్ళ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో...