పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి
. . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయటంతో పాటు పాఠశాలల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కొరకు ప్రభుత్వం నిధులను కేటాయించి పర్యవేక్షణ పెంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని శంకర్ భవన్ పాఠశాలను సందర్శించి పాఠశాల సిబ్బందితో ప్రధానోపాధ్యాయులతో, విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకుని...