ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి

  . . . బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్   బోధన్, బతుకమ్మ :   నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం బోధన్ పట్టణంలోని పీఆర్‌టీయూ భవన్‌లో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఎన్. బాల్‌రాజ్, ఎం.డి. మోషిన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో...