. . . సీసీ కెమెరాలను ప్రారంభించిన భీంగల్ సీఐ
కమ్మర్ పల్లి, బతుకమ్మ :
కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గ్రామస్తులు గ్రామ భద్రత కోసం 22 సీసీ కెమెరాల ఏర్పాటు చేయగా వాటిని బీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆదివారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులను అభినందించారు.ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ… గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలకు అడ్డుకట్ట వేయడం తో పాటు, శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. గ్రామస్తులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. గ్రామస్తులందరూ సమిష్టిగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో భద్రత మరింత పెరుగుతుందని, ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి ఎస్సై జి. అనిల్ రెడ్డి , సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
