- తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం
హైదరాబాద్, బతుకమ్మ : ఐఏఎస్ అధికారులపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం పేర్కొంది. టెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇన్‌చార్జ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి శ్రీదేవసేనపై వ్యక్తిగతంగా దాడి అని ఐఏఎస్ లసంఘం పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యలు అధికారుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, సివిల్ సర్వీసెస్ విలువలను అవమానపరుస్తున్నాయని పేర్కొంది. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం వల్ల పబ్లిక్ ట్రస్ట్ దెబ్బతింటుందని, అధికారుల మనోబలం తగ్గిపోతుందని తెలిపింది. అందువల్ల, ఈ నిరాధార వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలు చేయకూడదని, నియంత్రణతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది.