రుద్రూర్, బతుకమ్మ : బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల శ్రీ స్వయంభు బసవేశ్వర ఆలయం(గైనిగుట్ట) లో బుధవారం బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, మంగళ హారతులు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పరమేశ్ మహారాజ్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
