కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా బసవేశ్వర జయంతి

  కామారెడ్డి, బతుకమ్మ :   జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ బసవేశ్వర సమానత్వం, న్యాయం, మానవత్వానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆ విలువలను...