కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన బసవ లక్ష్మి నర్సయ్య

హైద్రాబాద్, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షలుగా బసవ లక్ష్మినర్సయ్య బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షలు రాంచంధర్ రావు సమక్షంలో బసవలక్ష్మి నర్సయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సంధర్బంగా రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లాల కిసాన్ మోర్చ నాయకులు లక్ష్మి నర్సయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిని చేసినంధుకు ధన్యవాదాలు తెలిపారు. కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో...