Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 6:26 pm Posted by : ramakrishna

ఘనంగా బసవ జయంతి వేడుకలు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలోని స్వయంభు బసవేశ్వర ఆలయంలో ఆదివారం బసవ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బసవేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి బసవ జయంతి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పరమేష్ మహారాజ్, ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.