Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 5:45 pm Posted by : ramakrishna

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాస రమేష్ యాదవ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లన్న కు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాస రమేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు గా ప్రకటించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. నామీద ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్ప చెప్పినందుకు పార్టీ ఆదేశానుసారం , పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సూచించిన విధంగా ముందుకు వెళ్తానని అన్నారు. ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఆకుల హనుమాన్ల కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుంతుల సందీప్, పటేలసుదవోయిన సతీష్ గౌడ్, రవిరాజ్ ముదిరాజ్, భాస్కర్ మాల, శంకర్ పటేల్, శ్యామ్ మాదిగ, రవి రాజ్ బట్టు, రాజ్, అశోక్ నాయక్, ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు.