ఓల్డ్ విద్యాశాఖ ఖాళీ స్థలాన్ని పరిశీలించిన ‘బార్’
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణం నేటి పరిస్థితుల దృష్ట సరిపోక పోవడంతో ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని కోర్టు అవసరాలకే కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ శ్రమిస్తున్న విషయం ఎరుకనే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు, జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వినతులను పెద్దఎత్తున అందజేసి పట్టువదలని విక్రమార్కుడిలా నిజామాబాద్ బార్ అసోసియేషన్ తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. జిల్లాకోర్టుకు అనుకుని అనువుగా ఉన్న పైన పేర్కొన్న స్థలాన్ని జిల్లా జుడిశియరి అవసరాలకే ఇవ్వాలనే వినతుల వెల్లువను కొనసాగిస్తున్నది. కాంగ్రెస్...