న్యాయమూర్తులకు ‘బార్ ‘ సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర జడ్జిల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన జడ్జిలు కుమారమ్ గోపికృష్ణ, ఖుష్భూ ఉపాధ్యాయ్ లకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యాక్షుడు దిలీప్ లు తమ సహచర కార్యవర్గ సభ్యులు రమాదేవి, ప్రవీణ, మద్దెపల్లి శంకర్, ముబీన్, నారాయణ ల ప్రతినిధి బృందంతో కలిసి పుష్పగుచ్చాలు అందించి సన్మానించారు. గోపికృష్ణ నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, ఖుష్భూ ఉపాధ్యాయ్ నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్...