Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 6:59 pm Posted by : ramakrishna

భగత్ సింగ్ కు బార్ అసోసియేషన్ నివాళి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి వేడుకలు బార్ అసోసియేషన్ హాల్ లో ఆయన చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ 1907పంజాబ్ జన్మించి చిన్నతనం నుంచి స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడే బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా పోరాటం చేసి దేశం కోసం పోరాడి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సైతం ముద్దాడి నేలకొరిగిన జాతీయ విప్లవకారుడని ఆయన వీర మరణం ధైర్యానికి ప్రతీక నేటి యువత ఆయన దేశ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో భార్ అసోసియేషన్ ఉపాఅధ్యక్షులు పి.రాజు సీనియర్ న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, శ్రీహరి, ఆచార్య జె వెంకటేశ్వర, నరేందర్ రెడ్డి, మాణిక్ రాజ్, ఉదయ్, కృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.