నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
భూతకాలాన్ని ,వర్తమాన కాలంతో సరిచూసుకుని భవిష్యత్ కాలంతో కలిసి నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగ న్ మోహన్ గౌడ్, ఉపాధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి సురేష్ దొన్పాల్,కోశాధికారి దీపక్ లు గురువారం జిల్లా ప్రధాన న్యాయముర్తి సునిత కుంచాలకు నూతన సంవత్సరం శుభాకాంక్ష లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జీ మాట్లాడుతు… మూడేళ్ళ పదవి కాలంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యుల సహాయ, సహకారాలు మరువలేనివని తెలిపారు .బార్ అండ్ బెంచ్ మద్య నెలకొన్న తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటు నూతన సంవత్సరాధితో పయనిద్దామని ఆమె అన్నారు. బార్ అండ్ బెంచ్ నెలకొల్పిన సంప్రదాయాలను కొనసాగిస్తామని బార్ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు.