Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 8:59 pm Posted by : ramakrishna

నూతన కోర్టు భవనాన్ని సందర్శించిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు

 

భీమ్ గల్, బతుకమ్మ

 

భీమ్ గల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన కోర్ట్ భవనాన్ని ఆర్మూర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సందర్శించారు. నూతన భవనంలో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులను పరిశీలించారు. నూతన కోర్ట్ భవనంలో నిర్మించిన కోర్ట్ హాల్, న్యాయవాదుల గదులు ఇతరత్ర అన్ని సౌకర్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్, సీనియర్ లాయర్ లోక భూపతి రెడ్డి, న్యాయవాదులు ఏలేటి గంగాధర్, చైతన్య, సురేష్ లు ఉన్నారు.