Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2025, 2:25 pm Posted by : ramakrishna

ఏప్రిల్ 11న బార్ అసోసియేషన్ ఎన్నికలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ బార్ అసోసియేషన్ (2025 – 26) ఎన్నికల ప్రక్రియను రీ షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నారు. ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విఘ్నేశ్, ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్ గౌడ్, బిట్ల రవిని నియమిస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ఆదివారం బార్ అసోసియేషన్ హాలులో నియామక పత్రాలు అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ ఇతర సభ్యుల సమక్షంలో శుక్రవారం హైదరాబాద్ లో అసోసియేషన్ అధ్యక్షుడితో నిర్వహించిన సమావేశంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులను నియమిస్తూ నిర్ణయించారు. బార్ కౌన్సిల్, నిజామాబాద్ అసోసియేషన్ మధ్య సమాచార లోపంతో అడ్ హక్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

ఎన్నికలు పూర్తిగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గం వివరాలను అందించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ కోరింది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు పెండెం రాజు, కోశాధికారి ఏ దీపక్, గ్రంథాలయ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, సీనియర్ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్, శివాజీ భోస్లె, రవి తదితరులు పాల్గొన్నారు.

 

Bar Association elections on April 11