టీఎస్ జెయు సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా బాపురెడ్డి ఎన్నిక

బతుకమ్మ, సిద్దిపేట : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జెయు) సిద్దిపేట జిల్లా కమిటీ సమావేశం సోమవారం శివాన్ భవ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ నాయకులు బాపురెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశానికి నేషనల్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఇండియా) జాతీయ ఉపాధ్యక్షులు ఎన్. పురుషోత్తం, టీఎస్ జెయు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మెరుగు చంద్రమోహన్, తోకల అనిల్ కుమార్, కోశాధికారి పాపాని నాగరాజు ముఖ్యఅతిధులు హాజరయ్యారు. సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులందరికి ఇల్లు లేదా ఇళ్ల...