Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 March 2025, 9:03 pm Posted by : ramakrishna

హాస్టళ్లను తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్

మద్నూర్,బతుకమ్మ: మద్నూర్ మండలంపై బాన్సువాడ సబ్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నిన్న కాక మొన్న ప్రభుత్వాస్పత్రిని సందర్శించి రోగులకు వైద్య చికిత్సల గురించి ఆరా తీశారు. శనివారం మళ్లీ మద్నూర్ మండల కేంద్రాన్ని సందర్శించి, మండల కేంద్రంలోని బాయ్స్, హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ను సబ్ కలెక్టర్ కిరణ్మై సందర్శించారు. హాస్టల్లో విద్యార్థిని విద్యార్థులకు వసతుల గురించి పరిశీలించారు. ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం భోజనాలు అందించాలని బాలికల, బాలుర, హాస్టల్ వార్డెన్లకు ఆదేశించారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని హాస్టల్ పిల్లలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వార్డెన్లను కోరారు. సబ్ కలెక్టర్ వెంట మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.

Banswada Sub-Collector inspects hostels