- పని ఒత్తిడి కారణంగానే ఘాతుకానికి ఒడిగట్టిన ఏఈ
బాన్సువాడ, బతుకమ్మ : పని ఒత్తిడి తాళలేక ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడల్లో ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ శ్రీకాంత్ గురువారం విధులు ముగించుకుని సాయంత్రం 6 గంటలకు కృష్ణా నగర్ తండా వద్ద గడ్డి మందు తాగాడు. అనంతరం బాన్సువాడలో ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో వారి అత్తమ్మ కు గడ్డి మందు సేవించానని శ్రీకాంత్ తెలిపారు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు బాన్సువాడ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 2018 నుంచి బాన్సువాడలో ఆర్ డబ్ల్యు ఎస్ విధులు నిర్వహిస్తున్నారు. 2022 లో షాద్ నగర్ కు బదిలీ అయ్యారు. అప్పటినుంచి బాన్సువాడ లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు.