బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల తుది జాబితా విడుదల
బాన్సువాడ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులకు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితా, పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఫోటో ఓటర్ల జాబితాలను కమిషనర్ బి. శ్రీహరి రాజు అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ...