Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2025, 6:29 pm Posted by : ramakrishna

వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన బాన్సువాడ నాయకులు

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్‌ను శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, రైతు సమస్యలు, పలు స్థానిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తమ నియోజకవర్గ సమస్యల పరిష్కార కోసం కృషి చేయాలని నాయకులు కోరారు. ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాసాని శ్రీనివాస్ రెడ్డి, మంత్రి గణేష్, కొత్తకొండ భాస్కర్, అంబర్ సింగ్,అంజాద్, నందు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Banswada leaders meet Agriculture Minister