బాన్సువాడ డీఎస్పీ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ డివిజన్ కేంద్రంగాలోని డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయానికి మొదటి సారి సందర్శించిన ఎస్పీకి డీఎస్పీ సత్యనారాయణ గౌడ్ మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయంలో సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాల సిబ్బందితో సమీక్షించారు. ఆయా మండలాల్లో కేసుల స్థితిగతులు, శాంతి భద్రతల పరిరక్షణ, సీసీ కెమెరాలు తదితర దొంగతనం కేసుల కేసుల వివరాలపై అరా తీశారు. డీఎస్పీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్...