మాజీమంత్రి హరీష్ రావు,కెటిఆర్ ను కలిసిన బాన్సువాడ ​బీఆర్​ఎస్ నాయకులు

బతుకమ్మ, బాన్సువాడ : స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిఒక్క బీఆర్​ఎస్​ కార్యకర్త సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్​ రావు సూచించారు.బాన్సువాడ నియోజకవర్గ బీఆర్​ఎస్​ నాయకులు సోమవారం హైదరాబాద్​లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. త్వరలోనే బాన్సువాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జీని నియమిస్తామని స్పష్టం చేశారు. అనంతరం బాన్సువాడలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. లోకల్బాడీ ఎలక్షన్లలో బాన్సువాడలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు.ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను గ్రామాల్లో ఎండగట్టాలని...