విద్యార్థులతో కలిసి భోజనం చేసిన బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా ఉండాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోఉపాధ్యాయులు కొంతం వెంకటేశం,విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.