Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2024, 4:02 pm Posted by : ramakrishna

సబ్ కలెక్టర్ ను కలిసిన బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ సరిత

బతుకమ్మ , బాన్సువాడ : బాన్సువాడ సబ్ కలెక్టర్ కోపిశెట్టి కిరణ్మయి ని ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్.సరితా దేవి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళ అధికారులకు గిఫ్ట్ కానుకలు పంపించారు. ఈ సందర్భంగా రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ బాన్సువాడ ఆర్టీసీ డిపో కు పంపిన గిఫ్ట్ ను సబ్ కలెక్టర్ కోపిశెట్టి కిరణ్మయిని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ డిపో మేనేజర్ ను అభినందించారు. మహిళలు ఏ రంగంలో పనిచేసినా ఉత్సాహంగా పాల్గొంటారని అన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేసి బాన్సువాడ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి డిప్యూటీ సూపరిడిడెంట్ బసంత్ ఉన్నారు.