Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 8:08 pm Posted by : ramakrishna

కామారెడ్డి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన బ్యాంక్ మేనేజర్ కొట్టూరి ప్రశాంత్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణంలో గల దేవునిపల్లి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా బ్యాంక్ మేనేజర్ కొట్టూరి ప్రశాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ బ్యాంకుల వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని, రైతులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న వారికి కూడా, కోఆపరేటివ్ బ్యాంకుల సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ పథకాల అమలుకు కోఆపరేటివ్ బ్యాంకు ఎప్పుడు ముందుంటుందని, మేనేజర్ కొట్టూరి ప్రశాంత్ అన్నారు. ఇతర వాణిజ్య బ్యాంక్ కన్నా తక్కువ వడ్డీ తో ఖర్హక మిత్ర,  గోల్డ్ లోన్ సదుపాయం, అతి ఎక్కవ వడ్డీ తో డిపాజిట్ ల స దుపాయం, తమ బ్రాంచ్ లో లాకర్  సదుపాయం కలదన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మౌనిక, శ్రీహరి, స్వప్న, కస్టమర్లు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.