నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యూఎస్డీసీ పిలుపు మేరకు మార్చ్ 24, 25 తేదీల్లో నిర్వహించే రెండు రోజుల నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వారానికి ఐదు రోజులు పనిదినాలు డిసెంబర్ 24,2024 నుంచి అమలు కావలి ఉన్నా ఇంకా ఆమోదించలేదన్నారు. అన్ని కేటగిరీల్లో తగినంత నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవి.రమేష్, ఏ.గురునాథ్, ఎస్.ప్రమోద్ కుమార్, టి.శ్రీనివాస్, సుధాకర్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.