ఘనంగా బంజారుల తీజ్ వేడుకలు
అత్యంత భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నగరంలోని పాలిటెక్నిక్ నుంచి కోర్టు వరకు ర్యాలీ నృత్యాలతో అలరించిన యువతులు, యువకులు బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ బంజారుల తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ నుండి కోర్టు వరకు బంజారులు ర్యాలీని నిర్వహించారు. తీజ్ ఉత్సవం దీనిని తీజారి అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని సంచార తెగకు చెందిన బంజారా సమాజానికి సంబంధించిన ముఖ్యమైన వేడుక. బంజారాలకు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. తీజ్ గిరిజనుల సంప్రదాయాలలో ముఖ్యమైన భాగం. హిందూ పురాణాలలో...