ప్రతి ఏడాది బంజారా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహించాలి
నిజామాబాద్, బతుకమ్మ: గోర్ బంజారా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహణ అభినందనీయమని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు హరికృష్ణ అన్నారు. కళలను, క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహించడంతోపాటు సమాజం ఐక్యమత్యంతో ఉండేలా నిర్వహించిన కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆఫీసర్స్ క్లబ్ లో నిర్వహించిన గోర్ బంజారా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆయన పాల్గొన్నారు. మూడు రోజులపాటు టోర్నీ నిర్వహణకు కృషి చేసిన ఉపాధ్యాయుడు ప్రకాశ్, ఏవో గంగారాం, వైద్యారోగ్యశాధికారి ప్రతాప్ సింగ్, దేవిసింగ్ కు హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మొట్టమొదటిసారి బంజారా...