Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 August 2025, 1:56 pm Posted by : ramakrishna

ఎఫ్ డి ఓ కార్యాలయం ముట్టడించిన  బంజార సంఘం నేతలు

  . . . రైతు కుటుంబం ఆత్మహత్య యత్నానికి కారకులైన అధికారులపై చర్యలకు  డిమాండ్

 . . . అటవీ శాఖాధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి పారేస్టు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ సౌత్ రెంజ్ ఆటవి శాఖాధికారుల వైఖరిని నిరసిస్తూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయం ముట్టడించారు. సౌత్ రెంజ్ పరిధిలోని కాల్పోల్- బైరాపుర్ బీట్ పరిధిలో ప్రకాష్ అనే రైతు సాగు చేస్తున్న పంటలపై గడ్డి మందు ఆటవి శాఖాధికారులు పిచికారి చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో మంగళవారం రైతు ప్రకాష్ కుటుంబ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా గిరిజన రైతు కుటుంబానికి న్యాయం చేయాలని  ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రమావత్ మోహన్ నాయక్, ప్రధాన కార్యధర్శి కేతావత్ ఫీర్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయం ముట్టడించిన వారిని పోలీసులు ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్నారు. గేటు ఎదుట బైఠాయించి  నిరసన  తెలిపారు.

Banjara community leaders besiege FDO office

 

ఈ వివాదంలో అటవీ అధికారుల విధులు అడ్డుకున్నారని ప్రకాష్ తో పాటు అతని భార్య, బావమరిదిపై ఆటవి శాఖాధికారుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై మోపాల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సంధర్బంగా బంజారా సంఘం నాయకులు మాట్లాడుతు… ఆటవి శాఖాధికారులు గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములు మూడు సంవత్సరాలు సాగు చేస్తున్న పంటలు సాగు చేసి గడ్డి మందుతో నాశనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా  వ్యవహరిస్తున్న అటవీ శాఖాధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులు వినతి పత్రం సమర్పించారు.

 

Banjara community leaders besiege FDO office