రుద్రూర్,బతుకమ్మ:
రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద పార్టీలకు అతీతంగా బంగ్లాదేశ్ పోటోలను దహనం చేశారు .హిందూ యువకుడు దీపుని అతి కిరాతకంగా బంగ్లాదేశీయులు చంపినందుకు నిరసనగా ఆదివారం సాయంత్రం బంగ్లాదేశ్ జాతీయ జెండా పోటోలు దహనం చేశారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి, దీపు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.