హిందువుల జోలికి వస్తే ఏమవుతుందో బంగ్లాదేశ్ కు తెలియజెప్పాలి
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హిందువుల జోలికి వస్తే ఎలా ఉంటుందో బంగ్లాదేశ్ కు తెలియచేయాల్సిన అవసరం, సమయం ఏర్పడిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘీభావ నిరసన కార్యక్రమానికి ఆయనముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు వివిధ హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా హిందూ కుటుంబాలకు బంగ్లాదేశ్...