Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2024, 6:51 pm Posted by : ramakrishna

హిందువుల జోలికి వస్తే ఏమవుతుందో బంగ్లాదేశ్ కు తెలియజెప్పాలి

  • ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హిందువుల జోలికి వస్తే ఎలా ఉంటుందో బంగ్లాదేశ్ కు తెలియచేయాల్సిన అవసరం, సమయం ఏర్పడిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘీభావ నిరసన కార్యక్రమానికి ఆయనముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు వివిధ హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా హిందూ కుటుంబాలకు బంగ్లాదేశ్ లాంటి ఘోరమైన దేశాలు కొన్ని నీచంగా ప్రవర్తించడం ప్రతి ఒక్కరూ ఖండించ దగ్గ విషయం అన్నారు. ఇలా మన సోదరులాంటి హిందువులపై పక్క దేశాల్లో ఇంతటి ఘోరమైన నిజానికి పాల్పడుతుంటే ఇప్పటికైనా దేశంలో ఉన్న హిందువులందరం ఐక్యంగా ఉండి బంగ్లాదేశ్ దేశానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడుల పై రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారికి మద్దతు తెలిపి వారి నిర్బంధంలో ఉన్న మన హిందువులను విముక్తి కలిగించేలా ఆ దేశ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలోజిల్లా బిజెపి అధ్యక్షుడుదినేష్ కులచారి పటేల్, లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ లతోపాటు, హిందూ ఐక్యవేదిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Bangladesh should be told what will happen if Hindus come in contact